రాబోయే కాలం బీజేపీదే..
07-06-2024 12:40 AM
- బీజేపీకి ఓటేసిన ప్రజలకు ధన్యవాదాలు
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు సునీల్‌రెడ్డి
మంథని, జూన్6 (విజయక్రాంతి): పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసిన ప్రజలకు పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు చందుపట్ల సునీల్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గరువారం ఆయన మంథనిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కనివీని ఎరుగని రీతిలో ప్రజలు బీజేపీకి ఓట్లు వేశారని సంతోషం వ్యక్తంచేశారు. కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధాని అవుతున్నారని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. ప్రజలు బీఆర్‌ఎస్ పార్టీని బొందపెట్టారని అన్నారు.






