పెద్దపల్లి హస్తగతం
కాంగ్రెస్ అభ్యర్థి వంశీకి 1.31 లక్షల ఓట్ల ఆధిక్యత
రాజకీయాల్లోకి వచ్చిన తొలి ప్రయత్నంలోనే వరించిన అదృష్టం
రెండోస్థానంలో బీజేపీ.. బీఆర్‌ఎస్ మూడో స్థానానికి పరిమితం
పెద్దపల్లి (మంథని), జూన్ 4 (విజయ క్రాంతి): పెద్దపల్లి పార్లమెంట్ స్థానం కాం గ్రెస్ వశమైంది. ఆ పార్టీ అభ్యర్థి, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీకృష్ణ 1,31,364 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. సీనియర్ ప్రత్య ర్థులను చిత్తుగా ఓడించి యుక్త వయసు లోనే పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. రెండో లీడులో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కు అనూహ్యంగా 3,44,223 ఓట్లు రాగా, బీఆర్‌ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పెద్దపల్లి జిల్లాలోని రామగిరి మం డలంలోని జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళా శాలలో ఓట్ల లెక్కింపు ప్రశాంతంగా ముగి సింది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు 1,465 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకి 5,407 ఓట్లు, బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌కు 5,116 ఓట్లు వచ్చాయి.
అనంతరం ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రారంభించగా, మొత్తం 21 రౌండ్లకు మొదటి రౌండ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ఆధిక్యతను ప్రదర్శించాడు. బీజేపీ అభ్యర్థి ఎలాంటి ప్రచారం చేయకపోయినా ఊహించని విధంగా ఓట్లు రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది. బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ప్రతీరౌండ్‌లోనూ మూడో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. ఒక దశలో బీజేపీ అభ్యర్థి ఓట్లు పుంజుకోవడంతో ఉత్కంఠ పరిస్థితి నెలకొంది. చివరకు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ భారీ మెజార్టీతో విజయం సాధించినట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
అనంతరం పెద్దపల్లి ఎంపీగా గెలుపొందిన యువ నేత గడ్డం వంశీకి ధ్రువీకరణ పత్రంను జిల్లా కలెక్టర్ అందజేసి అభినందనలు తెలిపారు. ఫలితాల అనం తరం గడ్డం వంశీ తన తండ్రి వివేక్ ఆశీ ర్వాదం తీసుకున్నారు. పెద్దపల్లి ఎంపీగా మొ దట వెంకటస్వామి, ఆ తర్వాత అతని కుమా రుడు గడ్డం వివేక్ పనిచేశారు. మధ్యలో ఒకమారు బీఆర్‌ఎస్ అభ్యర్థి బ్రేక్ చేశారు. ఇప్పుడు 18వ సారి జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ కాకా మనవడు, యువకుడు గడ్డం వంశీకృష్ణ గెలవడం విశేషం.
గడ్డం వంశీకృష్ణ గెలుపులో మంథని ఓట్లే కీలకం
చక్రం తిప్పిన మంత్రి శ్రీధర్‌బాబు
గడ్డం వంశీకృష్ణ గెలుపులో మంథని నియోజవర్గం ఓట్లే కీలకంగా మారాయి. మంత్రి శ్రీధర్‌బాబు అన్ని తానై పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజవర్గాల్లో ఎమ్మెల్యేలను ఒక్క తాటిపైకి తీసుకువచ్చారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు మంథనిలోనే మకాం వేసి, వ్యూహరచన చేశారు. పెద్దపల్లిలో 5,325 ఓట్లు, రామగుండంలో 10,131, మంచిర్యాలలో 19,457, చెన్నూర్‌లో 24,714 బెల్లంపల్లిలో 24,580 ఓట్లు రాగా, మంథని నియోజకవర్గంలో మాత్రం 52,957 ఓట్లు వంశీకృష్ణకు వచ్చాయి. మంత్రి సోదరుడు శ్రీనుబాబు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
తాత, తండ్రి వారసత్వం పుణికిపుచ్చుకొని
- వ్యాపారవేత్త నుంచి పార్లమెంటు సభ్యుడిగా
బరిలో దిగిన మొదటిసారే విజయాన్ని అందుకున్న వంశీకృష్ణ
మంచిర్యాల, జూన్ 4 (విజయక్రాంతి): తాత, తండ్రి, పెద్దనాన్న రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చిన్న వయస్సులో పెద్దపల్లి ఎంపీగా బరిలో నిలిచి విజయాన్ని అందుకున్నారు గడ్డం వంశీకృష్ణ. గడ్డం వివేక్, సరోజ దంపతులకు వంశీకృష్ణ 1989లో హైదరాబాద్‌లో జన్మించారు. గ్రాడ్యుయేషన్ (బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్‌మెంట్) 2010లో యూఎస్‌ఏలోని ఫర్డ్యూ యూనివర్సిటీలో పూర్తి చేశారు. అనంతరం పెన్నార్ ఇండస్ట్రీస్‌లో సంవత్సరం పాటు ప్రొఫెషనల్‌గా పని చేశారు. ఆ తర్వాత ఎలక్ట్రిక్ బైక్ ఉత్పత్తి కంపెనీ ఏర్పాటు చేసి 500 మందికిపైగా ఉద్యోగాలు కల్పించారు. వంశీకృష్ణకు భార్య రోషిణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
కాకా పేరు నిలబెడుతా
మా తాత కాలం నుంచి ఆదరిస్తున్న పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల రుణం తీరుచకుంటా. నాపై పెట్టుకున్న నమ్మకంను వమ్ము చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా. తాత గడ్డం వెంకటస్వామి పేరు నిలబెడుతాను. మా నాన్న వివేక్ ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చాను. నా మేధస్సును ఈ ప్రాంత అభివృద్ధికి వినయోగిస్తాను. రాజకీయ అనుభవం లేకపోయినా మొదటి నుంచి తాత వెంకటస్వామి దగ్గర నుంచి మా నాన్న వరకు వారి పరిపాలన దగ్గరనుంచి గమనించేవాడిని. తొలి ప్రయత్నంలోనే నాకు విజయం అందించిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలను ఎప్పటికీ మరిచిపోలేను. నాకు అవకాశం కల్పించిన సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబుకు కృతజ్ఙతలు.
నియోజకవర్గం కాంగ్రెస్ బీజేపీ బీఆర్‌ఎస్ విజేత మెజారిటీ
పెద్దపల్లి 4,75,587 3,44,223 1,93,356 వంశీకృష్ణ 1,31,364






