17 July, 2026 | 8:28 AM

ఇది కార్యకర్తల విజయం

05-06-2024 01:44 AM

ప్రజా మద్దతు కాంగ్రెస్‌కే 

100 రోజుల పాలనకు ఆశీస్సులు  

సీఎం రేవంత్‌రెడ్డి అభిప్రాయం

హైదరాబాద్, జూన్4 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ 100 రోజుల పాలనను ఆశీర్వదిస్తూ.. ఎనిమిది లోక్‌సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్  అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు అందించిన ఆశీర్వాదాలు ఆత్మస్థుర్యైన్ని పెంచాయని, మరింత సమర్థవంతమైన పాలన అందివ్వడానికి ఉత్సాహం ఇచ్చాయని తెలిపారు.

ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉన్నదన్న విషయాన్ని ఈ ఎన్నికలు మరోసారి రుజువు చేశాయని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ విజయం కోసం పని చేసిన కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులందరికి అభినందనలు తెలిపారు.  ఇది కార్యకర్తల విజయమని, వారి శ్రమను పార్టీ గుర్తిస్తోందన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే తిరిగి ప్రజాపాలన మొదలవుతుందని సీఎం తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా అద్భుతమైన పాలన అందిస్తామని స్పష్టం చేశారు.