16 July, 2026 | 9:27 PM

బాబ్లీ కేసులో మహారాష్ట్ర కోర్టుకు పెద్దపల్లి ఎమ్మెల్యే

06-06-2024 02:02 AM

పెద్దపల్లి (మంథని)జూన్ 5 (విజయక్రాంతి): బాబ్లీ కేసులో మహారాష్ట్రలోని బిలోలి కోర్టుకు బుధవారం పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు. ఉమ్మడి ఆంధ్రా పాలనలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నాటి ప్రజాప్రతినిధులతో కలిసి నీటి సమస్యపై బాబ్లీ ప్రాజెక్ట్‌పై ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. చంద్రబాబునాయుడి పిలుపుతో నాడు టీడీపీలో కొనసాగుతున్న విజయరమణారావు కార్యకర్తలతో కలిసి ఆందోళనలు చేపట్టారు. ఈ కేసులో ఆయన అప్పటి నుంచి విజయరమణారావు కోర్టుకు హాజరవుతూనే ఉన్నారు. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉన్నది.