అంధకారంలో గ్రామాలు
06-06-2024 02:04 AM
కుమ్రంభీం ఆసిఫాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలో ఇటీవలి వర్షాలకు పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు విరిగిపడ్డాయి, తీగలు తెగిపడ్డాయి. అప్పటినుంచి విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. పాడిబండ పంచాయతీ పరిధిలోని 11 గ్రామాలు ౪ రోజులుగా అంధకారంలోనే ఉన్నాయి. విద్యుత్తు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






