18 April, 2026 | 1:37 AM

పాఠశాల వంట కార్మికుల పెండింగ్ బిల్లులు, వేతనాలు విడుదల చేయాలి

09-06-2025 07:07 PM

తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్..

ములుగు (విజయక్రాంతి): తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్(Telangana Mid-Day Meal Scheme Workers Union) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ములుగు జిల్లా(Mulugu District) కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్ కి వినతిపత్రం అందజేయడం జరిగినది. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ మాట్లాడుతూ... పాఠశాలలు ప్రారంభానికి రెండు రోజులే ఉంది, కానీ వంట కార్మికులకు గత సంవత్సరం వంట బిల్లులు, వేతనాలు, కోడి గుడ్ల బిల్లులు పెండింగ్ లోనే ఉన్నాయి, మరి ఇప్పుడు వంటలు ఎలా చేయాలో అధికారులు ఆలోచన చేయాలని కోరారు.

అలాగే 2023 అక్టోబరు నెల నుండి అల్పాహారం బిల్లులు కూడా పెండింగ్ లోనే ఉన్నాయి అన్నారు దానితో పాటు రాగి జావ తయారు చేయడానికి గ్యాస్ సిలిండర్ల ఖర్చు చాలా అవుతుంది ఎలాంటి పారితోషికం లేకుండా తయారు చేయడం ఇబ్బంది కనుక రాగి జావకు ప్రతీ విద్యార్థికి రూ,,2 చెల్లించాలని డిమాండ్ చేశారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రూ.10వేల వేతనం వెంటనే చెల్లించాలని డిమాండ్ పెండింగ్ బిల్లులు వేతనాలు కోడి గుడ్ల బిల్లులు అన్నీ పాఠశాలలు ప్రారంభానికి ముందే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు ముత్యాల రాజు, సంఘం జిల్లా అధ్యక్షురాలు సామల రమ, ములుగు,వెంకటాపూర్, గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు కన్నాయిగూడెం నుండి,పోరెడ్డి ప్రమీల, గడ్డం భారతి, లక్ష్మి,పి సమ్మక్క, జమున, సుశీల,విజయ, చెంచులక్ష్మి,రమణ, వెంకటలక్ష్మి,రాజ్యలక్ష్మి, రాజకుమారి, పధ్మ,షఫియా, బండి జయమ్మ,జానకీ,జే లక్ష్మి,యం సరోజన, సుమతి, నర్సమ్మ, తులసి, కుమారి, వెంకటరమణ, రమాదేవి,ఫైమా, లావణ్య, నాగమణి,భవాణి,సుగుణ,తదితరులు పాల్గొన్నారు.