18 May, 2026 | 4:55 PM

మెడికల్ ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి పెండింగ్ వేతనాలు చెల్లించాలి

18-05-2026 02:43 PM

EPF, ESI లోపాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

ఆసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, మెడికల్ కాలేజీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (AITUC) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్ డిమాండ్ చేశారు.సోమవారం మెడికల్ కాలేజీ ఇంచార్జి సత్యంకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రతి నెల సకాలంలో జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

కొన్ని ఏజెన్సీలు ఉద్యోగుల ఈపీఎఫ్ డబ్బులు జమ చేయకపోవడంతో పాటు ఈఎస్ఐ, గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతి నెల 5వ తేదీలోపు జీతాలు చెల్లించడంతో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని కోరారు. అలాగే పే స్లిప్‌లు, ఐడీ కార్డులు, అపాయింట్‌మెంట్ లెటర్లు వెంటనే ఇవ్వాలని, లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో వినేశ్, దీపక్, సంజీవ్, పాల్ తదితరులు పాల్గొన్నారు.