3 July, 2026 | 8:42 PM

Breaking News

ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు పూర్తి   •   వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి   •  

గీతంలో పికిల్ బాల్ కోర్టులు ప్రారంభం

03-07-2026 08:08 PM

కొత్త వినోద సౌకర్యాలను కూడా ప్రారంభించి, సరదాగా మ్యాచ్ ఆడిన ప్రోవీసీ

పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, క్రీడలు, శారీరక దారుఢ్యం (ఫిట్ నెస్), విద్యార్థుల సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో తన నిబద్ధతను మరింత బలోపేతం చేస్తూ, శుక్రవారం నాడు కొత్తగా అభివృద్ధి చేసిన రెండు పికిల్ బాల్ కోర్టులతో పాటు పలు ఇతర ఇండోర్ వినోద సౌకర్యాలను ప్రారంభించింది. విశ్వవిద్యాలయంలో ఇప్పటికే ఉన్న ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు విస్తరణగా అభివృద్ధి చేసిన ఈ కొత్త పికిల్ బాల్ కోర్టులను హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా, ప్రొఫెసర్ రావు, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, ఆతిథ్య విభాగం-క్యాంపస్ లైఫ్ డైరెక్టర్ అంబికా ఫిలిప్, ఇతర ప్రముఖులతో కలిసి ఒక స్నేహపూర్వక ప్రారంభ మ్యాచ్ ఆడారు. అద్భుతమైన క్రీడా విజయానికి గుర్తింపుగా, పికిల్ బాల్ కోర్టు రిబ్బను కత్తిరించి, కోర్టులను ప్రారంభించవలసిందిగా జాతీయ స్థాయి పికిల్ బాల్ పోటీలలో బంగారు పతకం గెలుపొందిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని ఆశ్రిత రాజు దాట్లను ప్రోవీసీ ఆహ్వానించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా, డైరెక్టరేట్ ఆఫ్ స్పోర్ట్స్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఎం. నారాయణరావు చౌదరి, వివిధ క్రీడా విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కోచ్ లతో కలిసి సాంప్రదాయ పూజ నిర్వహించారు.

అదే సందర్భంగా, ప్రొఫెసర్ రావు ఎయిర్ హాకీ, టేబుల్ సాకర్ (ఫూస్ బాల్), స్నూకర్/ఎయిర్ బాల్ పూల్, లూడో, వైకుంఠపాళి (స్నేక్ అండ్ లాడర్), ఇతర ఇండోర్ ఆటలతో సహా అనేక కొత్త వినోద సౌకర్యాలను కూడా ప్రారంభించారు. ఇవి విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి మించి వినోదం, విశ్రాంతి కోసం అదనపు అవకాశాలను అందిస్తాయి. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులు మాట్లాడుతూ, ఈ కొత్త సౌకర్యాలు కేవలం విద్యా నైపుణ్యాన్నే కాకుండా విద్యార్థులలో శారీరక దృఢత్వం, మానసిక శ్రేయస్సు, సామాజిక భాగస్వామ్యాన్ని పెంపొందించే ఉత్సాహభరితమైన ప్రాంగణ వాతావరణాన్ని సృష్టించడంపై గీతం నిరంతర దృష్టిని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వివిధ స్కూళ్ల డైరెక్టర్లు, ప్రిన్సిపాళ్లు, పలు విభాగాల అధిపతులు, అధ్యాపకులు, పరిపాలనా సిబ్బంది, కోచ్ లతో పాటు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ప్రాంగణ జీవితాన్ని సుసంపన్నం చేయడానికి, సంపూర్ణ అభ్యాస అనుభవాన్ని అందించడానికి విశ్వవిద్యాలయం చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ప్రశంసిస్తూ, విద్యార్థులు ఈ కొత్త క్రీడా, వినోద సౌకర్యాల ఏర్పాటును ఉత్సాహంగా స్వాగతించారు