5 March, 2026 | 6:43 PM

బీడీ కార్మికులకు పెన్షన్ పెంచాలి

05-03-2026 04:55 PM

నిర్మల్ మార్చ్ 5 ( విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం బీడీ కార్మికులకు ఎన్నికల హామీలు ఇచ్చిన పెన్షన్ పెంచే ఆమెని వెంటనే అమలు చేయాలని సిఐటి జిల్లా కార్యదర్శి సురేష్ అన్నారు. గురువారం కలెక్టర్ కార్యాలయం ముందు బీడీ కార్మికుల ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం బీడీ కార్మికులకు 4 016 రూపాయల పెన్షన్ ఇస్తామని ఎన్నికల హామీ ఇచ్చిందని వెంటనే అమలు చేయాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేస్తారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు గంగాధర్ లక్ష్మి, బేగం తదితరులు పాల్గొన్నారు