వృద్ధులు, బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వాలి
22-08-2026 03:46 PM
బెజ్జంకి, ఆగస్టు 22: వృద్ధులు, బీడీ కార్మికుల నుంచి చేయూత కొత్త పింఛన్ల దరఖాస్తులను వెంటనే స్వీకరించాలని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బెజ్జంకి మండల కేంద్రంలో జరిగిన సీపీఎం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పోర్టల్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ దరఖాస్తుల స్వీకరణకు అవకాశం కల్పించాలని కోరారు. ఆగస్టు 31 తుది గడువును పొడిగించి, పింఛన్లను నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని అన్నారు. అర్హులందరికీ పింఛన్లు మంజూరు చేయడంతో పాటు పింఛన్ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బొమ్మిడి సాయికృష్ణ, సంఘ ఎల్లయ్య, బోనగిరి లింగం తదితరులు పాల్గొన్నారు.






