24 August, 2026 | 11:33 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

తెగిపోయిన కల్వర్టు

27-06-2025 01:11 PM

రాకపోకలకు ఇబ్బందులు పడుతున్న ప్రజలు 

కుమ్రంభీంఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడా గ్రామ పంచాయతీ(Buruguda Gram Panchayat) పరిధిలోని రాజుర గ్రామానికి వెళ్లే మార్గంలోని కల్వర్టు ఇటీవల కురిసిన వర్షానికి పూర్తిగా కొట్టుకుపోయింది. అటు వైపుగా వెళ్ళే ప్రజలకు ,వ్యవసాయ దారులకు చాలా ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం వస్తే రోడ్డు పూర్తిగా బురదమయం కావడంతో పాటు రోడ్డు మార్గంలో ఉన్న కల్వర్టులు కొట్టుకపోవడంతో ప్రతి సంవత్సరం ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు. వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అధికారులు, నాయకుడు స్పందించి కల్వర్టు నిర్మాణం చేపట్టడంతో పాటు రోడ్డు కు మరిమత్తులు చేయాలని రైతులు, గ్రామస్థులు కోరుతున్నారు.