11 August, 2026 | 2:02 PM

Breaking News

బెంగాల్ సర్ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు   •   ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •  

కదం తొక్కిన మహిళలు

27-06-2025 12:46 PM

తాగునీటి సమస్య తీర్చాలని, బెల్ట్ షాప్ తొలగించాలని ఆందోళన 

కాగజ్ నగర్,(విజయక్రాంతి): కాగజ్ నగర్ మండలంలోని బట్టు పల్లి, చింతగూడ గ్రామా లకు చెందిన మహిళలు, రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. భట్టుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గత కొన్ని రోజులుగా మంచినీటి సమస్య(Drinking Water) తీవ్రoగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ మహిళలు ఖాళీ బిందెలతో గ్రామపంచాయతీ రహదారిపై నిరసన తెలిపారు. నీటి సమస్యను పరిష్కరిస్తామని, అధికారులు హామీ ఇవ్వడంతో మహిళలు ఆందోళన విరమించారు. 

ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఆందోళన

కాగజ్ నగర్ మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన మహిళలు, రైతులు కాగజ్ నగర్  పట్టణంలోని ఎక్సైజ్ కార్యాలయం(Excise Office) ఎదుట ధర్నా చేపట్టారు. తమ గ్రామంలో విచ్చలవిడిగా మద్యం బెల్ట్ షాపులు ఏర్పడ్డాయి. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సత్వరమే ఆ బెల్ట్ షాపులను తొలగించాలంటూ మహిళలు, గ్రామస్తులు ముక్తకంఠంతో నినాదాలు తీశారు. ఎక్సైజ్ సిఐ రవికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. సత్వరమే బెల్ట్ షాపులను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టమైన హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళన వివరించారు.