calender_icon.png 19 February, 2026 | 3:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ ప్రగల్భాలను ప్రజలు నమ్మడం లేదు

19-02-2026 01:49:51 AM

ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి 

హైదరాబాద్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): కేటీఆర్ ఎన్ని ప్రగల్బాలు పలికినా ప్రజలు నమ్మడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నెం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌ను మొన్న గ్రామీణ ప్రజలు, ఇప్పుడు అర్బన్ ఓటర్లు కూడా ఆదరించలేదన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఇప్పటికైన ఫామ్‌హౌస్‌ను వీడి బయటకు వచ్చి ప్రతిపక్ష పాత్ర పోషించాలని, అప్పుడే అధికారంలోకి వస్తారని తెలిపారు.

రేవంత్‌రెడ్డి ప్రజా సమస్యలపై పోరాటం చేసిండు కాబట్టి సీఎం అయ్యారని చెప్పారు. రాహుల్ గాంధీ డైరెక్షన్‌లో సీఎం రేవంత్ రెడ్డి సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నారని, ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 60శాతం రిజర్వేషన్లు ఇచ్చామన్నారు. జనరల్ స్థానంలో కూడా బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు టికెట్ ఇచ్చి గెలిపించామన్నారు.