14 August, 2026 | 10:52 PM

దోమకాటు వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి

14-08-2026 09:00 PM

దోమల నివారణకై... అవగాహనే ముఖ్యం

కీసర సర్కిల్ డిసి జి. రామలింగం

జవహర్ నగర్,(విజయక్రాంతి): దోమకాటు వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని దోమల నివారణకై అవగాహనే ముఖ్యమని కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జి.రామలింగం పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ దమ్మాయిగూడ డివిజన్ ఇందిరమ్మ కాలనీ దమ్మాయిగూడ, జవహర్ నగర్, యాప్రాల్ చంద్రపురి కాలనీలో దోమల నివారణకై ఎంటమాలజీ విభాగం వారి ఆధ్వర్యంలో శుక్రవారం (ఫ్రైడే  డ్రైడే) అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ రామలింగం హాజరై మాట్లాడుతూ వ్యాధుల పట్ల చికిత్స కంటే నివారనే ముఖ్యమని దోమల నివారణకు ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని ఇంటి ఆవరణ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు..దోమల వల్ల మలేరియా డెంగ్యూ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని మొదట మన ఇల్లు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే దోమలను నివారించవచ్చునని తెలిపారు. 

దోమల నివారణకు దోమతెరలు వంటి ఉత్తమ సాధనాలు ఉపయోగించి దోమల వ్యాప్తిని అరికట్టవచ్చునని చికిత్స కంటే నివారణే ఉత్తమ మార్గమని తెలిపారు.అనంతరం దమ్మాయిగూడ డివిజన్ ఇందిరమ్మ కాలనీ జవహర్ నగర్ యాప్రాల్ చంద్రపురి కాలనీ డివిజన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఏఈ భాస్కర్, తిరుపతి రాజ్, అనిల్, వార్డు ఎంటమాలజి సూపర్వైజర్లు శ్రీనివాస్, స్వామి, కాలనీ సభ్యులు ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.