14 August, 2026 | 10:03 PM

Breaking News

విద్యుత్ ఉచ్చుకు బలైన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌కు ఘన నివాళి   •   విద్యార్థులు కళావేదికను సద్వినియోగం చేసుకొని ఉన్నతులుగా ఎదగాలి   •   విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి   •   బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన డీసీపీ భాస్కర్   •   ఖబర్దార్ కౌశిక్ రెడ్డి.. పొంగులేటి సైన్యం ఊరుకోదు   •   పశువుల దొంగలు అరెస్టు   •   శ్రీ మహంకాళి సమేత బ్రహ్మసూత్ర నీలకంఠ స్వామి ఆలయంలో వైభవంగా కళ్యాణ మహోత్సవం   •   మోస్రా వెళ్లే ప్రయాణికులకు తప్పని తిప్పలు   •   సీఎస్ సంజయ్ జాజు పలు అంశాలపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్   •   వైన్ షాపులో చోరీకి పాల్పడిన వ్యక్తి అరెస్ట్   •  

డంపింగ్ యార్డ్‌ నిర్మించవద్దు

14-08-2026 08:57 PM

సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్

చౌటుప్పల్,(విజయక్రాంతి): అంకిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 326లో (స్మశాన వాటిక పక్కన) చౌటుప్పల్ మున్సిపాలిటీ చెత్త నిల్వ కోసం చేపడుతున్న డంపింగ్ యార్డ్‌ నిర్మాణాన్ని వెంటనే నిలిపివేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో సుమారు 150 మంది మహిళలు, యువకులు, గ్రామ పెద్దలు శుక్రవారం మున్సిపల్ కార్యాలయానికి భారీ ర్యాలీగా వచ్చి ధర్నా నిర్వహించారు.​

జనవాసాలు, పాఠశాలలకు కనీసం 2 కిలోమీటర్ల దూరంలో డంపింగ్ యార్డ్‌ను ఏర్పాటు చేయాలని కోరుతూ మున్సిపల్ చైర్మన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, మున్సిపల్ కమిషనర్‌లకు వినతిపత్రం అందజేశారు. దీనిపై చైర్మన్ స్పందిస్తూ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని డంపింగ్ యార్డ్‌ను ఇతర ప్రాంతానికి తరలించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ​ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ సుర్వి సత్తయ్య గౌడ్, పర్ని శ్రీనివాస్ రెడ్డి, దొడ్ల సెట్టయ్య గౌడ్, భీమగోని మల్లేశం గౌడ్, కాకులారం సంజీవరెడ్డి, బత్తుల అనూష, దొడ్ల అండాలు, రాపోలు రేణుక, గ్రామ యువకులు, మహిళలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.