ప్రజలే గుణపాఠం చెప్తారు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): రానున్న రోజుల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులకు ప్రజలే గుణపాఠం చెప్తారని ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో(Municipal Elections) బిఆర్ఎస్ నుండి పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు సూర శ్యామ్ , రేవల్లి తిరుపతి లు అన్నారు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... మున్సిపల్ ఎన్నికల్లో తప్పుడు ఓట్లతో, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎనిమిది, తొమ్మిదవ వార్డు అభ్యర్థులపై జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశామని, ఎన్నికల కమిషనర్, హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు, ఈ విలేకరుల సమావేశంలో బిఆర్ఎస్ నాయకులు తిప్పారపు దయాకర్, అనుమాల బాబురావు, మహేష్ , అజయ్, అక్బర్, అనిల్, కాళీ చరణ్ , వెంకటేష్ , రాజు పలువురు పాల్గొన్నారు.




