18 April, 2026 | 1:04 PM

Breaking News

ఎంపీ తేజస్వి సూర్యను బర్తరఫ్ చేయాలి   •   హైదరాబాద్లో ఫుట్‌పాత్ ఆక్రమణలపై GHMC కొరడా   •   పార్లమెంట్‌ ఉభయసభలు నిరవధిక వాయిదా— బడ్జెట్ సమావేశాలు ముగింపు   •   పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు   •   ఇరాన్‌పై మళ్లీ బాంబులేస్తాం... ట్రంప్‌ సంచలన ప్రకటన   •   ప్రకాష్ రాజ్‌పై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా   •   ప్రేమ, పెళ్లి పేరుతో మోసం— మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం   •   బాధిత కుటుంబాలకు పరిహారం అందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్   •   “నో హెల్మెట్- నో పెట్రోల్”— హెల్మెట్ అవసరంపై అవగాహన   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేకు వినతి   •  

ఆస్తిపన్ను వడ్డీపై 90 శాతం రాయితీ

26-03-2025 01:47 AM
  1. అమలులోకి వన్ టైం సెటిల్‌మెంట్ స్కీం
  2. నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల్లో వర్తింపు
  3. ఈ నెల 31వ తేదీ ఆఖరి గడువు

హైదరాబాద్, మార్చి 25: ఆస్తిపన్ను చెల్లించని వారికి తెలంగాణ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. పన్నుపై వడ్డీలో 90శాతం రాయితీ ఇస్తామని, యజమానులు అసలుతో పాటు కేవలం 10 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుందని ప్రకటించింది. ఈమేరకు వన్ టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీ ఎస్) స్కీంను అమలు చేస్తున్నట్లు మం గళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

స్కీంను సద్వినియోగం చేసుకునేందుకు ఈ నెల 31 ఆఖరు తేదీ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ స్కీం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో అమలు ఉంది. జీహెచ్‌ఎంసీలో సత్ఫలితాలు వస్తుండడంతో స్కీంను సర్కార్ రాష్ట్రమంతటా అమలు చేయాలని నిర్ణయించింది.