calender_icon.png 2 February, 2026 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం: నెమలి అనిల్

02-02-2026 06:10:35 PM

ఉప్పల్,(విజయక్రాంతి): మల్లాపూర్ డివిజన్లోని తాగునీరు సమస్యకు శాశ్వత పరిష్కారం వచ్చేవరకు కాంగ్రెస్ పార్టీ తరఫున నిరంతరం పోరాటం చేస్తానాన్ని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు నెమలి అనిల్ కుమార్ అన్నారు. మల్లాపూర్ డివిజన్ పరిధిలోని కెఎన్ రెడ్డి నగర్  భవాని నగర్ అన్నపూర్ణ కాలనీలో నెలకొన్న తాగునీటి  సమస్యపై సోమవారం రోజున  ఉప్పల్ కార్యాలయంలో జలమండలి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... డివిజన్ పరిధిలోని తక్కువ నీటిని విడుదల చేయడంతో తాగునీరు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన తెలిపారు. రసాయన పరిశ్రమల కారణంగా గ్రౌండ్ బోరు నీటి కాలుష్యంతో బోరు నీరు లేక అటు మంచినీరు రాక  ప్రజలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని సమస్యను పరిష్కరించాలని ఆయన అధికారులను కోరినట్లు తెలిపారు. దీని గాను  అధికారులు త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారని ఆయన ఈ కార్యక్రమంలోజలమండలి ఏఈ సిరాజుద్దీన్ మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ తాండ్ర శ్రీకాంత్ రెడ్డి సీనియర్ నాయకులు మతాల బాలరాజు గౌడ్ జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్ దాసరి సాయి కుమార్ పాల్గొన్నారు