2 September, 2026 | 1:50 AM

అనుమతి ఒకచోట.. వెంచర్ మరోచోట

02-09-2026 | 12:00am
  1. పాత తేదీలలో జీపీ అనుమతిపై అనుమానాలు 
  2. రోడ్డు లేకుండా వెంచర్ ఏర్పాటు 
  3. రోడ్డు కోసం పక్క భూముల యజమానులపై దౌర్జన్యం 
  4. కీసర మండలం గోధుమకుంటలో వెంచర్ నిర్వాహకుల బాగోతం 

మేడ్చల్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): ఒక సర్వే నెంబర్ లో అనుమతి తీసుకుని మరో సర్వేనెంబర్ లో వెంచర్ ఏర్పాటు చేసిన వ్యవహారం కీసర మండలం గోధుమ కుంటలో వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని గోకర కుంటలో సర్వేనెంబర్ 4 లో వెంచర్ కు అనుమతి తీసుకున్నారు. కానీ 5,6 సర్వే నెంబర్లలో ప్లాట్లు చేసి విక్రయాలు జరుపుతున్నారు.

సర్వేనెంబర్ 4 యజమాని 5,6 సర్వే నంబర్లలో కబ్జాలో ఉండగా, ఈ సర్వే నెంబర్లకు చెందిన యజమాని సర్వే నంబర్ 4 లో కబ్జాలో ఉన్నారు. సర్వే నెంబర్ సరి చేసుకోకుండా వెంచర్ ఏర్పాటు  చేయడం వల్ల కొనుగోలుదారులకు భవిష్యత్తులో చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది. వెంచర్ నిర్వాహకులు మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా గజానికి రూ.20 వేలపైన విక్రయిస్తున్నారు. 

జీపీ అనుమతి పై అనుమానాలు 

ఈ వెంచర్ కు 1988లో అప్పటి సర్పంచ్ అవసల పండరి మూడు ఎకరాల పైన వెం చర్ కు అనుమతి తీసుకున్నట్లు నిర్వాహకు లు చెబుతున్నారు. వెంచర్ మాత్రం 20 23లో మహేందర్ రెడ్డి సర్పంచ్ గా ఉన్న స మయంలో ఏర్పాటు చేశారు. 1987లో అ నుమతి ఇచ్చిన విషయమై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అధికారులు వి చారణ చేయాల్సిన అవసరం ఉంది. 

దారి కోసం దౌర్జన్యం 

ఈ వెంచర్ కు సరైన దారి లేదు. చెరువు కట్టను దారిగా చూపెడుతున్నారు. చెరువు క ట్టని వెడల్పు చేసి సర్వే నెంబరు రెండు ను ంచి దారివేయాలని ప్రయత్నిస్తున్నారు. సర్వే నెంబర్ 2 య జమానులు తమ భూమి నుంచి దారి ఇవ్వడానికి నిరాకరిస్తుండడంతో దౌర్జన్యానికి పా ల్పడుతున్నారని, భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. 

చెరువు విస్తీర్ణం తగ్గడంపై అనుమానాలు 

గోరకుంట విస్తీర్ణం కేవలం 4.20 ఎకరాలేనని ఇరిగేషన్ అధికారులు తేల్చడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాత పహానిలో 14.20 ఎకరాలు ఉందని, చెరువు కట్ట కూడా చాలా పొడవు ఉందని గ్రామస్తులు తెలిపారు. చెరువు విస్తీర్ణం తగ్గడంలో ఏదో గోల్మాల్ జరిగిందని అంటున్నారు. అంతేగాక చెరువులో అక్రమంగా క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేశారని తెలిపారు. 

ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు..

ఒక సర్వే నెంబర్ లోర్ అనుమతి తీసుకుని మరో సర్వే నంబర్ లో వెంచర్ ఏర్పాటు చేయడంపై డిప్యూటీ కమిషనర్, కలెక్టర్ కార్యాలయం, హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదు చేసాం, కానీ ఎవరు పట్టించుకోవడంలేదు. వెంచర్ కు దారి లేదు. మా భూమి నుంచి రోడ్డు వేస్తామని దౌర్జన్యం చేస్తున్నారు. కొంత భూమి కబ్జా చేశారు. గ్రామపంచాయతీ అనుమతి విషయంలో ఫోర్జరీ చేశారు. తమ బాగోతం బయటపడుతుందని సర్వేను వెంచర్ నిర్వాహకులు అడ్డుకుంటున్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. 

 సామల దయానంద రెడ్డి, గోధుమ కుంట.