5 March, 2026 | 6:41 PM

శివాజీ విగ్రహం ఏర్పాటుకు అనుమతి ఇవ్వాలి

05-03-2026 04:59 PM

కలెక్టర్ కు బిజెపి నాయకుల వినతి 

మణుగూరు,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని టెలిఫోన్ ఎక్సేంజ్ సమీపంలో ప్రధాన రహదారిపై చత్రపతి శివాజీ(Shivaji statue) విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అనుమతులు మంజూరు చేయాలని,బిజె పి నాయకులు లింగంపల్లి రమేష్, దుగ్గి బ్రహ్మతేజ గురువారం జిల్లా కలెక్టర్ అంకిత్ ను కలిసి వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మరాఠ వీరుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ మత సామరస్యాలకు అతీతంగా భారతీయులనంతా ఏకం చేసిన గొప్ప నాయకుడని, ఆయన విగ్రహాన్ని మణుగూరులో ఏర్పాటు చేయడం ద్వారా యువతకు స్ఫూర్తినిస్తుందని బీజేపీ నాయకులు తెలిపారు.