చైన్ స్నాచింగ్ పాల్పడిన వ్యక్తి అరెస్ట్
ఉప్పల్,(విజయక్రాంతి): కాస్మోటిక్ షాప్ లోని కొనుగోలుదారుడుగా వచ్చి దృష్టి మళ్లించి మెడలోని మంగళసూత్రం తస్కరించి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించిన సంఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన ప్రకారం... ఉప్పల్ రామంతపూర్ వెంకట్ రెడ్డి నగర్ చెందిన కాసుల సంధ్య 35 ఉప్పల్ హనుమాన్ సాయి నగర్ లో ఒక కాస్మోటిక్ షాప్ లో పనిచేస్తుంది.
గురువారం నాడు ఓ యువకుడు కొనుగోలుదారుడుగా దుకాణానికి వచ్చి ఫేస్ వాష్ ధర గురించి అడిగి తన దృష్టి మరలించి మెడలోని మంగళసూత్రం లాక్కొని పారిపోయేందుకు ప్రయత్నించాడు దీంతో బాధితురాలు ప్రతిఘటించి కేకలు వేయడంతో స్థానికులు అతని పట్టుకొని ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన చేరుకొని చైన్ స్నాచింగ్ పాల్పడిన వ్యక్తిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.






