26 August, 2026 | 8:30 PM

Breaking News

గల్ఫ్ కార్మికుడి కుటుంబానికి ఆర్థిక సాయం

26-08-2026 07:57 PM

కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండల కేంద్రానికి చెందిన గల్ఫ్ కార్మికుడు బొల్లె ప్రశాంత్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని గల్ఫ్ మిత్రులు ఆదుకున్నారు. కోనరావుపేట గల్ఫ్ మిత్రులు, సౌదీ అరేబియా టీం కలిసి ప్రశాంత్ కుటుంబానికి రూ.93,000 ఆర్థిక సహాయంతో పాటు 50 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఆపద సమయంలో కుటుంబానికి అండగా నిలిచిన గల్ఫ్ మిత్రులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్గం అశోక్, దుర్ల రవి, గొట్టే భూపతి, గొట్టే దాము, గొర్రె నవీన్, బోయిని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.