పెస్టిసైడ్స్ షాపులు బంద్ విజయవంతం
కూసుమంచి, ఏప్రిల్ 27(విజయక్రాంతి): డీలర్లపై ఎరువులు, పురుగు మందుల స్టాక్ పాయింట్ నుండి తీసుకురావడానికి రవాణా ఖర్చులు డీలర్ల పై వేయడంతో దానిని నిరసిస్తూ కూసుమంచి మండలంలోని పురుగుల మందు, ఎరువుల దుకాణ యజమానులు సోమవారం షాపులు బంద్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఫెర్టిలైజర్ షాప్ అసోసియేషన్ ఈసీ మెంబర్ ఎండి రంజాన్ అలీ మాట్లాడుతూ... రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు, ఎరువులు, ఫెర్టిలైజర్ షాపుల బంద్ నిర్వహించామని అలాగే నిరసన ప్రదర్శన కూసుమంచి మండల కేంద్రంలో చేపట్టామని తెలిపారు. మండల డీలర్ల సంఘం అధ్యక్షులు ఇంటూరి నారాయణ మాట్లాడుతూ కంపెనీలు ఎరువులు, పురుగు మందుల విషయంలో ఏదో ఒక లింకు పెట్టడాన్ని స్వస్తి పలకాలని ఆయన డిమాండ్ చేశారు. కంపెనీ లు అవలంబిస్తున్న విధానం తో రైతులపై అధిక భారం పడుతుందని, ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీలర్లు శ్యాంసుందర్ రెడ్డి, కన్నయ్య ,తిరుపతిరావు, కూరపాటి సందీప్ ,హరీష్, చెన్నారెడ్డి ,సుధీర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






