19 August, 2026 | 1:08 PM

నర్సంపేటలో టెన్షన్ టెన్షన్

19-08-2026 12:32 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): వరంగల్ జిల్లా నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Former MLA Peddi Sudarshan Reddy) విగ్రహం తొలగింపును నిరసిస్తూ ఇచ్చిన బంద్ పిలుపు లో భాగంగా బుధవారం తెల్లవారుజాము నుండి ఆర్టీసీ బస్సులు డిపో నుండి బయటకు రాలేదు. పట్టణంలో పూర్తిగా బంద్ పాటిస్తున్నారు. భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఆటు పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లిలోనూ కొనసాగుతున్న బంద్. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి శివయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఘటన నేపథ్యంలో అక్కడే కాంగ్రెస్ నేతలు బుధవారం పాలాభిషేకం నిర్వహించారు. నర్సంపేట పట్టణంలో భారీగా మోహరించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు(BRS cadres). పట్టణంలోని ప్రధాన రహదారిలో ఉన్న పెండెం కట్టయ్య విగ్రహం వద్ద ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇప్పుడేం జరుగుతుందో అన్న టెన్షన్ నర్సంపేటలో నెలకొంది. తొలగించిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించే వరకు ఆందోళన కొనసాగిస్తామని టిఆర్ఎస్ నేతల ప్రకటన. పట్టణంలో పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు.