బాన్సువాడ లో ఘనంగా ప్రపంచ ఫోటోగ్రఫీ డే దినోత్సవం
బాన్సువాడ, ఆగస్టు 19,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోనీ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ వెల్ఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంను బుధవారం ఘనంగా జరుపుకోవడం జరిగింది కెమెరా సృష్టికర్త. లూయిస్- జాకాస్ - మండే డాగురె చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ మాటల్లో చెప్పలేని భావాలను కాలంలో ఆగిపోయిన జ్ఞాపకాలను ఒక్క క్లిక్ తో శాశ్వతంగా నిలిపే అద్భుత కలే ఫోటోగ్రఫీ అని తెలియజేశారు. సీనియర్ ఫోటోగ్రఫీ పెద్దలకు సన్మానం చేయడం జరిగింది. అందరికీ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అరుణ్. ఉపాధ్యక్షులు నదీమ్. సెక్రటరీ పత్తి సాయిలు. క్యాషియర్ కృష్ణ సలహాదారులు. సురేష్ గౌడ్. గంగాధర్ యాదవ్. మధుసూదన్. గోపాల్ గౌడ్. మోహన్. గోవర్ధన్. దత్తు. చంద్రశేఖర్. రమేష్. కృష్ణ తదితరులు పాల్గొన్నారు.






