28 February, 2026 | 8:35 PM

మేరు కులస్తుల సమస్యలను పరిష్కరించాలని డీఏఓకు వినతి పత్రం అందజేత

28-02-2026 06:41 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): మేరు కులస్తుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కామారెడ్డి జిల్లా బాన్సువాడ మేరు సంఘం సభ్యులు శనివారం రోజున డిఎఓకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బాన్సువాడ మేరు సంఘం అధ్యక్షులు వి టూరి హనుమాన్లు మాట్లాడుతూ... కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తూన్న తమ కులస్తులు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారని కావున ప్రభుత్వ పరంగా వర్తించే ఫలాలను అందించి ఆదుకోవాలని కోరారు.

మేర కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ప్రభుత్వ పాఠశాలల సంక్షేమ హాస్టల్లో తదితర ప్రభుత్వ శాఖల యూనిఫాం కు ట్టించే పనిని మేరు కులస్తులకు మాత్రమే ఇప్పించాలని వారు కోరారు. నూతన టెక్నాలజీ తో వచ్చిన జూకి మిషన్లను సబ్సిడీతో అందించి ఆదుకోవాలని బీసీ కార్పొరేషన్ నుండి ప్రతి ఒక్క కార్మికునికి ఐదు నుండి 10 లక్షల రుణం నేరుగా ఇప్పించి 80% సబ్సిడీతో ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ మేరు సంఘం ఉపాధ్యక్షులు కొట్టు రు మహేష్. రుద్రంగి వారి మహేందర్. జిల్లా ఉపాధ్యక్షులు సిలాంకోటి మహేష్. సభ్యులు కొట్టు రు సురేష్. నందు. సంతోష్.రాజు.తదితరులు పాల్గొన్నారు.