30 June, 2026 | 10:48 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

అంగన్వాడీల సమస్యలపై ఎమ్మెల్యేకు వినతి

03-12-2024 04:37 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): అంగన్వాడీ టీచర్ లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విన్నవించారు. ఈ మేరకు ఆదిలాబాద్ లో మంగళవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను కలిసి యూనియన్ నాయకురాలు రాధా వినతి పత్రాన్ని సమర్పించారు. టీచర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో చర్చించి, పరిష్కరించేలా చూడాలని ఎమ్మెల్యేని కోరారు. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పులాగా తెలంగాణలో సైతం టీచర్లు, ఆయాలు 3rd, 4th క్లాస్ ఎంప్లాయిస్ గా గుర్తించాలని కోరారు. టీచర్ లకు 26 వేలు, ఆయాలకు 18 వేలు ఇవ్వాలని అన్నారు. ఇతరత్రా సమస్యలను పరిష్కరించేల చూడాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.