4 August, 2026 | 1:48 AM

ప్రజావాణికి 102 ఫిర్యాదులు

04-08-2026 12:00 AM

అర్జీలను త్వరగా పరిష్కరించాలి 

కలెక్టర్ సి.నారాయణ రెడ్డి

రంగారెడ్డి, అగస్టు 3 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 102 వినతులు ను జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి  వినతులు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 33, ఇతర శాఖలకు సంబంధించి 69 ఫిర్యాదులు అందాయి.

సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ అధికారులందరూ ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రజల నుంచి వ చ్చిన అర్జీలను ఏమాత్రం పెండింగ్లో పెట్టకుండా, నిర్దేశిత గడువులోగా జాప్యం లే కుండా పరిష్కరించాలని స్పష్టం చేశారు. కా ర్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రారెడ్డి, కిరణ్మయి, డిఆర్‌ఓ శారదతో పాటు వి విధ శాఖల అధికారులు పాల్గొన్నారు.