టీఎస్ ఎస్టీయూ ఆధ్వర్యంలో టెట్ స్టడీ మెటీరియల్ పంపిణీ
నాగల్గిద్ద, ఆగస్టు 3 (విజయ క్రాంతి) : తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ నాగల్గిద్ద మండల శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు టెట్ స్టడీ మెటీరియల్ పంపిణీతో పాటు మండల వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టెట్ పరీక్షలకు సిద్ధమవుతున్న ఉపాధ్యాయులకు అధ్యయన సామగ్రిని అందజేసి, పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని నాయకులు ఆకాంక్షించారు.
కేవలం రూ.500కే నాణ్యమైన టెట్ స్టడీ మెటీరియల్ను అందిస్తున్నామని, ఆసక్తి గల ఉపాధ్యాయులు 9491992291 నంబర్ను సంప్రదించాలని జిల్లా అదనపు కార్యదర్శి శివశంకర్ రాథోడ్ తెలిపారు. అనంతరం మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు.
సంఘం చేపడుతున్న ఉపాధ్యాయ సంక్షేమ కార్యక్రమాలు, హక్కుల పరిరక్షణ కోసం చేస్తున్న కృషిని వివరించి సభ్యత్వం పొందాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విజయ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు ఎం. రాజ్కుమార్, జిల్లా నాయకుడు కాశీరాం, సీనియర్ ఉపాధ్యాయులు మారుతి, రంజిత్, అరుణ్, రామచంద్ర, మాణిక్తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






