08-06-2025 12:17:16 AM
చలపతి ఇన్‌స్టిట్యూట్ ప్రిన్సిపాల్ నాదెండ్ల రామారావు
గుంటూరు, జూన్ 7 (విజయ్‌క్రాంతి): ఫార్మసీ విద్య అంటే శాస్త్రానికి అంకితమైన మార్గమని, సేవకు స్థిరమైన మూలాధారమ ని చలపతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూ టి కల్ సైన్సెస్ ప్రిన్సిపాల్ నాదెండ్ల రామారావు తెలిపారు. ఫార్మసీ విద్య గురించి విజయక్రా ంతితో ఆయన మాట్లాడారు. ఔషధ విద్య అ నగా కేవలం మందుల తయారీ, వా టి ప ంపిణీ మాత్రమే కాదని ప్రజా ఆరోగ్య ర ంగంలో వ్యాధుల నివారణ, ఆరోగ్య చైత న్య కార్యక్రమాలలో నాయకత్వం వహించటమన్నారు.
సమగ్ర భవిష్యత్తుకు తగిన విధం గా అభివృద్ధి చెందుతున్న రంగాలలో ఔషధ విద్య ప్రథమ స్థానంలో ఉందని తెలిపారు. అలాంటి ఈ విద్యా రంగంలో బీఫార్మసీ, ఫా మ్ డి, ఎం ఫామ్ వంటి కోర్సులు ముం దంజలో ఉన్నాయని తెలిపారు. బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ నాలుగు సంవత్సరాల ప్రాథమిక డిగ్రీగా ఉం దన్నారు. ఈ డి గ్రీ ఫార్మా సూటికల్ కెమిస్ట్రీ, ఫా ర్మా కాలేజీ, ఫా ర్మా స్కూటిక్స్, ఫా ర్మా కాగ్నోసి వంటి విభాగాల్లో పరిజ్ఞానాన్ని అందిస్తుందని తెలిపారు.
డాక్టర్ ఆఫ్ ఫా ర్మసీ అనే కోర్స్ కూడా ఆరు సంవత్సరా ల కాల పరిమితి అని తెలిపారు. ప్రతి విద్యాలయాల్లో ప్రస్తుతం పుస్తకాలు చదువుతూ ప రిమితమయ్యే విద్యే కాకుండా ప్రయోగశాల లో నేరుగా ప్రాక్టికల్ నైపుణ్యాలను అభ్యసించే అవకాశాలను ప్రతి ఫార్మా కళాశాలలు ఏర్పాటు చేశాయని తెలిపారు.
క్లినికల్ ట్ర యల్స్ నిర్వహణలో పేషంట్ల సేఫ్టీ, ట్రయల్ ప్రోటోకాల్స్, ఫార్మకోవిజిలెన్స్ వంటి అంశా ల్లో దృఢంగా పనిచేస్తారని తెలిపారు. ప్రతి విద్యార్థి ఫార్మసీ విద్యను ఉద్యోగ సాధన కో సమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచాలన్న సంకల్పంతో చదవాలన్నారు.