16 April, 2026 | 4:22 AM

కేఎస్‌సీఏలో ఇద్దరి రాజీనామా

08-06-2025 12:21 AM

బెంగళూరు తొక్కిసలాట ఘటన కేసులో

బెంగళూరు, జూన్ 7: బెంగళూ రు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగి న తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘ టనకు నైతిక బాధ్యత వహిస్తూ కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కేఎస్‌సీఏ) కార్యదర్శి ఏ శంకర్, ట్రెజరర్ ఈఎస్ జైరాం తమ పదవులకు రాజీనామా చేశారు. తొక్కిసలాట ఘటనలో 11 మంది మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు. ‘గత రెండు రో జులుగా ఊహించని, దురదృష్టకర ఘటనలు జరిగాయి.

ఇందులో మా పాత్ర పరిమితమైనప్పటికీ మేం మా పదవులకు రాజీనామా చేస్తు న్నాం’ అని శంకర్, జైరాం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. కాగా కేసు ద ర్యాప్తును బెంగళూరు పో లీసులు వే గవంతం చేశారు. ఇప్పటికే ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖి ల్ సోసాలే ను అరెస్ట్ చేశారు. వీరితో పాటు ఈవెంట్ నిర్వాహక సంస్థ డీఎన్‌ఏ నెట్‌వర్క్స్ లిమిటెడ్‌కు చెందిన ముగ్గురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.