4 April, 2026 | 8:26 PM

విష్ణువర్ధనరెడ్డికి పిహెచ్‌డి డాక్టరేట్

04-04-2026 06:43 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ విశ్వవిద్యాలయంలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి విష్ణువర్ధనరెడ్డి తమ విశిష్టమైన పరిశోధనకు గాను ప్రతిష్టాత్మకమైన డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్ డీ) పట్టాను అందుకున్నారు.

ఆయన పరిశోధన శీర్షిక ఆప్టిమైజ్ లంగ్ క్యాన్సర్ క్లాసిఫికేషన్ తూ మేల్తి స్కేల్ ఫీచర్ ఎక్స్ అట్రాక్షన్ అండ్ ట్రాన్స్ఫార్మర్ ఎం ఆన్సర్ డీప్ లెర్నింగ్ మోడల్స్ ఈవిశిష్ట విజయంపై ఉపకులపతి, డీన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, డీన్ (సిఎస్ఈ), కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి, అధ్యాపకులు, సహచరులు కుటుంబ సభ్యులు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఆయన కృషి, పట్టుదల, శాస్త్రీయ ప్రతిభను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో ఆయన మరిన్ని పరిశోధనలు, ఆవిష్కరణలు, వృత్తిపరమైన విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.