01-11-2025 06:29:56 PM
- సెల్ ఫోన్ పోయిన వెంటనే స్థానిక పీఎస్ లో ఫిర్యాదు చేయాలి
- జిల్లా అదనపు ఎస్పీ మహేందర్
పాపన్నపేట,(విజయక్రాంతి): పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో 30 ఫోన్లు రికవరీ కావడం సంతోషకరమని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. శనివారం పాపన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ మాసంలో రికవరీ ఆయన 30 ఫోన్లను శనివారం బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. రికవరీ అయిన ఫోన్ల విలువ సుమారు రూ.5.05లక్షలు ఉంటుందన్నారు. ఠాణా పరిధిలో ఇప్పటి వరకు 381ఫోన్లు రికవరీ అయినట్లు పేర్కొన్నారు.
సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు చాలా ఫోన్లు రికవరీ అయినట్లు తెలిపారు. ఫోన్లు రికవరీ అవడం చాలా సంతోషకరమన్నారు. ఎక్కడైనా ఫోన్ పోగొట్టుకున్న వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని సూచించారు. పోలీసు అధికారులు, సిబ్బంది కృషి అభినందనీయమన్నారు. మెదక్ డీఎస్పీ ప్రసన్నకుమార్, రూరల్ సీఐ జార్జ్, ఎస్సై శ్రీనివాస్ గౌడ్, పోలీసు కానిస్టేబుళ్లు నానుసింగ్, బస్వరాజు, హఫీజ్ తదితరులున్నారు.