calender_icon.png 2 November, 2025 | 9:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాధితురాలికి అండగా ఉంటాం

01-11-2025 06:26:59 PM

ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య

కామారెడ్డి,(విజయక్రాంతి): అత్యాచారానికి గురైన మహిళకు అండగా ఉంటామని ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. శనివారం కామారెడ్డి ఆర్ అండ్ బి అతిథిగృహంలో ఆయన మాట్లాడారు. కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పర్దీ పేట గ్రామానికి చెందిన మహిళ అత్యాచారం ఘటన విషయం తెలుసుకున్న ఆయన బాధిత మహిళను కామారెడ్డిలో పరామర్శించారు. ఘటనకు సంబంధించిన వివరాలను ఏఎస్పీ చైతన్య రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తుల ద్వారా ఆరా తీశారు. ప్రభుత్వం ద్వారా బాధిత మహిళకు పరిహారం అందే విధంగా చూడాలని సూచించారు.

బాధితు రాలి పిల్లలకు చదువు నేర్పించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. నిందితుడిని పట్టుకున్న పోలీసులను అభినందించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. బాధిత మహిళకు ప్రభుత్వం పరంగా అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తెలిపారు. బాధితురాలును ఆధైర్యపడవద్దని తెలిపారు. ప్రభుత్వం నుంచి వచ్చే సహాయ సహకారాలు అందేలా చూస్తామని ఆయన పేర్కొన్నారు. ఆయనతోపాటు అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు, దళిత సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.