నగర వేదికగా పికిల్ బాల్ లీగ్ రెండో సీజన్: యశ్వంత్ బియ్యాల

11-09-2026 | 04:05am

బంజారాహిల్స్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): నగర వేదికగా పికిల్ బాల్ లీగ్(Pickle Ball League) రెండో సీజన్ అక్టోబర్ 17 నుంచి నిర్వహించనున్నామని సెంటర్ కోర్ట్ స్పోరట్స్ అండ్ ఎంటర్ టైన్మెంట్ సహ వ్యవస్థాపకుడు యశ్వంత్ బియ్యాల వెల్లడించారు. ఈ విషయమై ఆయన గురువారం మాట్లాడుతూ గతంలో మొదటి సీజన్ కూడా హైదరాబాద్ లో నిర్వహించారు.

త్వరలోనే రెండో సీజన్ ప్రారంభించనుండడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఇటీవలే థాయిలాండ్ లోని పుకెట్ లో ఫ్రాంచైజీ యజమానుల, సీజన్-2 ఆటగాళ్ల వేలం ప్రక్రియ విజయవంతంగా ముగిసిందన్నారు. గతేడాది హైదరాబాద్ పికిల్ బాల్ లీగ్ పేరిట 8 ఫ్రాంచైజీ జట్లతో ప్రారంభమైన ఈ టోర్నీ ఈ ఏడాది సీసీపీఎల్ గా రెండో సీజన్ కు సిద్దమైందని వివ రించారు. గత సీజన్ చాంపియన్ మ్యావెరిక్స్ జట్టు శ్రీకర్ మొతుకూరిని అట్టిపె ట్టుకోగా, రన్నరప్ ఆల్ స్టార్స్ జట్టులోకి సమీర్ వర్మ తిరిగి వచ్చాడన్నారు.

మిఖిల్ తుమ్మలపల్లి, వివేక్ రెడ్డి తమ పాత ఫ్రాంచైజీల తరఫునే బరిలోకి దిగనున్నారని వివ రించారు. కరుణేష్ రెడ్డి, అభయ వేమూరి, గోపీనాథ్ రెడ్డి రిటెయిన్ ఆటగాళ్ల జాబితాలో నిలిచారన్నారు. మరోవైపు చార్జర్స్ జట్టు మాత్రం భిన్నమైన వ్యూహాన్ని అమలు చేసిందన్నారు.

ఒక్కరిని కూడా రిటెయిన్ చేసుకోకుండా నేరుగా ఫుల్ బడ్జెట్తో వేలంలోకి దిగి కొత్త జట్టును నిర్మించుకుందని ప్రకటించారు. రిటెన్షన్ తర్వాత మిగిలిన స్థానాలను భర్తీ చేసేందుకు ఆయా ఫ్రాంచైజీలు వేలంలో పోటాపోటీగా తలపడ్డాయ న్నారు. మరో సహ వ్యవస్థాపకుడు విక్రాంత్ రావు మాట్లాడుతూ.. ఆటగాళ్ల రిటెన్షన్లు, ప్రీ-ఆక్షన్ పిక్స్ ద్వారా ఈ సీసన్లో ఫ్రాంచైజీల వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయో స్పష్టమైందని పేర్కొన్నారు. పుకెట్లో వేలం ప్రక్రియ పూర్తి కావడంతో లీగ్ ప్రారంభానికి ఆరు వారాల సమయం ఉందన్నారు. జట్లన్నీ సమాయత్తమవ్వడానికి ఇది సరైన సమయమని తెలియజేశారు.


మరిన్ని వార్తలు