6 May, 2026 | 11:07 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

కజకిస్థాన్‌లో విమాన ప్రమాదం

26-12-2024 03:54 AM
  • ౩8 మంది దుర్మరణం
  • రష్యాకు వెళ్తుండగా ఘటన
  • ఘటనా సమయంలో విమానంలో 67 మంది

బాకు, డిసెంబర్ 25: కజకిస్థాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ౩8 మంది మర ణించారు. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం కజకిస్థాన్‌లోని అక్టౌ నగరం సమీపంలో జరిగిందని ఆ దేశ అత్యవసర మంత్రి త్వ శాఖ అధికారులు తెలిపారు. అజర్‌బైజా న్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం  67 మందితో అజర్‌బైజాన్ రాజధాని బాకు నుంచి రష్యాలోని చెచెన్యా రాజధాని గ్రోజ్నీకి వెళుతోంది. గ్రోజ్నీలో దట్టమైన పొగమంచు కారణంగా  విమానాన్ని 1800 కిలోమీటర్ల దూరంలోని కజకిస్థాన్‌లోని అక్టౌ విమానాశ్రయానికి మళ్లించారు.

ఈ క్రమంలోనే అక్టౌ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతి కోరారు. ఈ క్రమంలో విమానం ఆకాశంలో తిరుగుతూ విమానాశ్రయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉండగా ప్రమాదవశాత్తు కూలిపోయింది. విమానం కూలిపోగానే భారీగా మంటలు ఎగిసిపడి రెండు ముక్కలుగా విడిపోయింది. ఓ భాగం నుంచి ప్రయాణికులు బయటకు వచ్చిన దృశ్యాలు కనిపించాయి. మరోభాగం లో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ఈ ఘటనలో ౩౮ మంది చనిపోయారు. అయి తే చివరి నిమిషాల్లో సాంకేతిక లోపం ఏర్పడడంతోనే విమానం కూలినట్లు తెలుస్తోంది. 

పక్షుల గుంపు ఢీ కొట్టడంతో..?

ప్రమాదం జరగగానే రెస్క్యూ టీమ్స్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు  చేపట్టాయి. విమానం నుంచి 25 మంది ప్రయాణికులను కాపాడారు. వారిలో బాలిక (11), బాలుడు(16) సహా ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విమానం నుంచి ౩౮ మంది మృతదేహాలను బయటకు తీశారు.

కాగా ప్రమాద సమయంలో ఐదుగురు సిబ్బంది, 62 మంది ప్రయాణికులతో కలిపి మొత్తం 67 మంది ఉన్నారు. అయితే విమా నం ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా పక్షుల గుంపు ఢీ కొట్టడంతో స్టీరింగ్‌లో సాంకేతిక సమస్య ఏర్పడడం లేదా ఇక ఇంజిన్ దెబ్బతినడం వల్లు విమానం కూలినట్లు అనుమా నిస్తున్నారు. విమానం కూలిపోయిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.