ప్రయాగ్‌రాజ్ ఓ అద్భుత నగరం
- 1400 ఏళ్ల కిత్రమే చైనీయులకు గమ్యస్థానం
- తీర్థరాజ్‌గా పేరొందిన ప్రయాగ్‌రాజ్
- పురాతన సంప్రదాయాలకు నెలవు
- చైనా యాత్రికుడు హ్యుయాన్ సాంగ్
- భారత పర్యటనపై గ్రంథం రాసిన చైనీయుడు
ప్రయాగ్‌రాజ్, డిసెంబర్ 25: త్వరలో మహా కుంభమేళా జరుగునున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్‌రాజ్ చరి త్ర గురించి ప్రపంచమంతా తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఈక్రమంలో కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ నగరం ఎలా ఉండేదో తెలసుకోవాలనే ఆసక్తి పెరుగుతున్నది. ఈ క్రమంలో నాటి రచనలు, గ్రంథాలు తదితర చారిత్రక ఆధారాల కోసం వెతుకుతున్నారు.
ముఖ్యంగా ప్రయాగ్‌రాజ్ గురించి అద్భుతం గా వర్ణించిన చైనా పర్యాటకుడు హ్యుయాన్ సాంగ్ రచనలపై ఆధారపడుతున్నారు. 1400 సంవత్సరాల క్రితమే ప్రముఖ చైనా యాత్రికుడు హ్యుయాన్ సాంగ్ ప్రయాగ్ రాజ్‌ను సందర్శించి దానిని ఆధ్యాత్మిక నగరంగా పేర్కొన్నాడు. ఈ నగరం శతాబ్దాలుగా పవిత్ర గంగా, యుమన నదీ సంగమంలో ఉండడంతో యాత్రికులను ఆకర్షిస్తోందని తెలిపాడు. అలాగే పురాతన సంప్రదాయాలకు నెలవుగా ఉందని కొనియాడారు.
సమృద్ధికి మారుపేరు..
దాదాపు 1400 సంవత్సరాల క్రితమే చైనా యాత్రికులు, ప్రజలకు గమ్యస్థానంగా ఉందని ప్రసిద్ధ చైనా యాత్రికుడు జావాన్ జాంగ్ అలియాస్ హ్యుయాన్ సాంగ్ తన రచనలలో పేర్కొన్నాడు. ఏడో శతాబ్దంలో భారత దేశాన్ని హ్యుయాన్ సాంగ్ సందర్శించాడు. దేశంలో వివిధ ప్రాంతాలను అధ్య యనం చేస్తూ 16 సంవత్సరాలు గడిపాడు. ఈ క్రమంలోనే ప్రయాగ్‌రాజ్‌ను సందర్శించారు.
క్రీ.శ. 644లో రాజు హర్షవర్దనుడి రాజ్యాన్ని సందర్శించి.. ఆ రాజ్యంలో ధాన్యం సమృద్ధిగా ఉందని పేర్కొన్నాడు. అంతేకాకుండా ప్రజలు నివసించడానికి అనుకూలమైన వాతావరణ, ఆరోగ్యం, సమృద్ధిగా పండ్లను ఇచ్చే చెట్లు ఉన్న ప్రాంతంగా ప్రయాగ్ రాజ్‌ను వర్ణించాడు. ప్రయాగ్ రాజ్ , దాని చుట్టు పక్కల ప్రజలు వినయపూర్వకంగా ఉండేవారని, చక్కగా ప్రవర్తించేవారని, నేర్చుకోవడానికి అంకితభావంతో ఉన్నారని ప్రశంసించాడు.
పవిత్ర నదుల మధ్యలో..
రెండు పవిత్ర నదులైన గంగా, యమునా నదుల మధ్యన ప్రయాగ్‌రాజ్ నెలకొని ఉం దని జువాన్ పేర్కొన్నాడు. ఈ రాజ్యం దాదా పు 1,000 మైళ్ల వరకు విస్తరించి ఉందని వివరించాడు. అలాగే నాడు నగరంలోని ప్ర ఖ్యాత దేవాలయం (ప్రస్తుతం కోట లోపల ఉన్న పాటలపురి ఆలయం) గురించి కూడా రాశాడు. ఆ గుడి అలంకరణ, మిరుమిట్లు గొలిపేలా అత్యద్భుతంగా ఉందని వర్ణించా డు. ఇక్కడ ఒక నాణేన్ని అందిస్తే పుణ్యం దృష్ట్యా వెయ్యి నాణేలను విరాళంగా ఇచ్చినట్లు ప్రజలు విశ్వసిస్తారని ఆయన తన పుస్త కంలో రాశారు. ప్రయాగరాజ్‌లో స్నానం చేయడం వల్ల అన్ని పాపాలు పోతాయని ప్రజలు నమ్ముతారని ఆయన పేర్కొన్నారు.
తీర్థరాజ్‌గా ప్రయాగ్‌రాజ్..
భారతదేశ సాంస్కృతిక వారసత్వంపై చైనా ఎల్లప్పుడు మక్కువ చూపెడుతూనే ఉందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేసింది. పురా వాస్తు సర్వేలు, అధ్యయనాలు ప్రయాగ్‌రాజ్‌ను తీర్థరాజ్‌గా పేర్కొన్నాయి. ఎటువంటి కారణం లేకుండానే ఈ బిరుదును ప్రయాగ్‌రాజ్ సంపాదించలేదనే వాస్తవాన్ని ఆ అధ్యయనాలు మరింత సమర్థిస్తున్నాయని ప్రభుత్వం ఆ ప్రకటనలో పేర్కొంది.
పురాతన శిలాయుగం, మధ్య శిలాయు గం, నియోలిథిక్ కాలాల నుంచి సాంస్కృతిక అభివృద్ధిని ప్రయాగ్‌రాజ్‌లోని మేజా తహసీల్‌లోని బేలాన్, టోన్స్ నదుల సంగ మం వెల్లడిస్తుంది. దీని చరిత్రను వెలికి తీయడానికి 1962 బేలన్, సేవతి ప్రాంతాల్లో అలహాబా యూనివర్సిటీలోని ప్రాచీన చరిత్ర విభాగం ఒక సర్వేను నిర్వహించింది.
ఈ క్రమంలో హనుమాన్ గంజ్, లోన్‌ఘాటి, మజ్‌గవాన్ వంటి పురాతన ప్రదేశాలను వెలికితీసినట్లు ప్రభుత్వం తెలిపింది. బేలన్ వ్యాలీ సర్వే కూడా ప్రారంభ కాలంలో మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలను వెలికితీసింది. ఇక్కడ లభించిన సాంస్కృతిక అవశేషాలు, కుండల శకలాలు ఈ ప్రాంతంలో నివసించిన ప్రజల గురించి జీవన విధానాలను వివరిస్తాయని ఆ ప్రకటనలో పేర్కొన్నది.
సాంస్కృతిక కేంద్రంగా..
భారత్‌లో తన పర్యటన వివరాలపై ‘సి-- అనే గ్రంథాన్ని జువాన్ జాంగ్ రాశాడు. ప్రయాగ్‌రాజ్ సాంస్కృతిక ప్రాముఖ్యత గురించా ఆ పుస్తకంలో వివరించాడు. దేశం నలుమూలల నుంచి రాజులు, పాలకులు మతపరమై న పండుగలను జరుపుకోవడానికి, స మాజానికి విరాళాలు ఇవ్వడానికి ఇక్కడ కు వచ్చేవారని పేర్కొన్నాడు. ఈ పాలకుల్లో శక్తివంతమైన రాజు హర్షవర్ధను డు అని, అతని పాలన అత్యంత ప్రముఖమైనదని వివరించాడు. నాటి కాలం లోప్రయాగ్‌రాజ్ ప్రాముఖ్యత గురించి హ్యుయాన్ సాంగ్ రచనలు అందిస్తా యి. ప్రయాగ్‌రాజ్‌లో పెద్ద మతపరమై న ఉత్సవాలు జరిగాయని, ఈ కార్యక్రమాల్లో ఎందరో రాజలు, పాలకులు పాల్గొన్నారని, దాదాపు 5,00,000 మందికి పైగా ప్రజలు హాజరయ్యారని జువాన్ తన రచనల్లో పేర్కొన్నారు.
ఏడురోజుల ఉపవాసం..
ప్రయాగ్‌రాజ్‌కు వచ్చిన సందర్శకులు ఏడు రోజుల పాటు ఉపవాసం ఉండే ప్రత్యేక సంప్రదాయాన్ని పాటిస్తున్నారని హ్యుయాన్‌సాంగ్ పేర్కొన్నాడు. గంగా, యమున నదుల మధ్య అందమైన, స్వచ్ఛమైన ఇసుక మైదానం ఉండడంతో దేశంలోని అత్యంత సంపన్నులు ఇక్కడ సంగమంలో స్నానం చేసి వెళ్లే ముందు తమ సంపదను విరాళంగా ఇస్తారని తన రచనల్లో హ్యుయాన్‌సాంగ్ వివరించారు.






