14 April, 2026 | 4:59 PM

Breaking News

షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ పలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •   అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం   •   ప్రమాదరహిత సమాజాన్ని నిర్మిద్దాం: డీజీపీ శివధర్ రెడ్డి   •   కొండంత పని చేస్తున్నాం.. గడప గడపకూ చెప్పండి!   •  

బుద్ధి మాంద్యం పిల్లల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు

05-02-2026 12:00 AM

సుల్తానాబాద్, పెద్దపల్లిలో పర్యటించిన కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి, సుల్తానాబాద్ , ఫిబ్రవరి 4 (విజయ క్రాంతి): బుద్ది మాంద్యం పిల్లల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు .బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్, పెద్దపల్లి పట్టణాలలో విస్తృతంగా పర్యటించారు. సుల్తానాబాద్ పట్టణంలో బుద్ధి మాంద్యం పిల్లలకు ఏర్పా టు చేసిన పాఠశాల, చిల్డ్రన్ హోమ్, వృద్ధాశ్రమం, ఔషధ గోడౌన్, పెద్దపల్లి పట్టణం లోని చిల్డ్రన్ హోమ్ ను కలెక్టర్ సందర్శించా రు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష, బుద్ధి మంద్యం పిల్లలకు ఏర్పాటుచేసిన పాఠశాలలో వారి అభివృద్ధి చెందుతు న్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశా రు. పిల్లలకు అవసరమైన ఫిజియోథెరపీ సే వలు పూర్తి స్థాయిలో అందించాలని, ప్ర భుత్వ ఆసుపత్రిలో ఉన్న ఫిజియోథెరపిస్ట్ సే వలను పూర్తి స్థాయిలో వాడుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎదుగుదల సరిగ్గా లేని పిల్లలకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డును వినియోగించాలని కలెక్టర్ తెలిపారు.

వృద్ధాశ్రమం కు సరఫరా చేసిన వస్తువులను తని ఖీ చేసి త్వరగా వృద్ధాశ్రమం ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు.  చిల్డ్రన్ హోమ్ నిర్మాణ పనులు ఆలస్యం కావడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. చిల్డ్రన్ హోమ్ నిర్మాణ పనులు నెల రోజులలో పూర్తి కాని పక్షంలో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం గట్టేపల్లి లోని ఎం.పీ.పీ.ఎస్.పాఠశాల ను సందర్శించి వి ద్యార్థుల హాజరు తదితర వివరాలు అడిగి తె లుసుకున్నారు.

ఔషద గోడౌన్ లో మెడిసిన్ స్టాక్ కట్టుదిట్టంగా మెయింటైన్ చేయాలని అన్నారు.పెద్దపల్లి చిల్డ్రన్ హోమ్ లో కలెక్టర్ పిల్లలతో ముచ్చటించి వారికి అందుతున్న సేవల వివరాలు తెలుసుకున్నారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారి వేణు గోపాల్, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.