calender_icon.png 5 February, 2026 | 7:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయితీ కార్యదర్శుల డిజిటల్ టోకెన్లు చోరీ

05-02-2026 12:00:00 AM

ఇబ్బడి ముబ్బడిగా బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీ 

పోలీసులకు అధికారుల ఫిర్యాదు 

బయ్యారం మండలంలో భారీ స్కాం

మహబూబాబాద్, ఫిబ్రవరి 4 (విజయక్రాంతి): పంచాయతీ పరిపాలనలో కీలకమై న పంచాయితీ కార్యదర్శులకు చెందిన డిజిటల్ టోకెన్లు గల్లంతైన ఘటన మహబూ బాబాద్ జిల్లా బయ్యారం మండలంలో చోటుచేసుకుంది. నాలుగు గ్రామాల పంచాయతీ కార్యదర్శులకు చెందిన టోకెన్లను దొం గిలించి వాటి ద్వారా ఇబ్బడి ముబ్బడిగా బర్త్, డెత్ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు బయ్యారం పోలీసులకు ఈ ఘటనపై మండల పంచాయతీ అధికారి చంద్రమోహన్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు  చేశారు.

సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బయ్యారం మండలంలోని ఈర్సలాపురం, నామాలపాడు, బాల్య తండా, కొత్తగూడెం నాలుగు గ్రామాలకు చెందిన పంచాయతీ కార్యదర్శులకు చెందిన డిజిటల్ సిగ్నేచర్ కీ మండల పరిషత్ పంచాయతీ అధికారి కా ర్యాలయంలో భద్రపరచగా గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. పంచాయితీ కార్యదర్శులు నిత్యం యూఎస్బీ పోర్టల్ విని యోగానికి ఉపయోగించే డిజిటల్ సంతకం, లాగిన్ కావడానికి ప్రత్యేకంగా టోకెన్ వినియోగిస్తారు.

ఇందులో పంచాయతీ కార్యదర్శి డిజిటల్ సంతకం, లాగిన్ పాస్వర్డ్ తదితర వివరాలు ఉంటాయి. వాటి ఆధారంగా ఆయా గ్రామాల్లో జన్మించిన, మర ణించిన వారి వివరాలను, ఇతర ఆదాయ వ్యయ వివరాలను కూడా ఆన్లైన్ ద్వారా నమోదు చేయడానికి వినియోగిస్తారు. ప్రతి కార్యదర్శికి ఒక పాస్వర్డ్, యూజర్ ఐడి, డిజిటల్ సిగ్నేచర్ తో కూడిన ప్రత్యేకమైన టోకెన్ ఉంటుంది. ఈ క్రమంలో బయ్యారం మండలంలోని నాలుగు గ్రామాలకు సంబంధిం చిన పంచాయతీ కార్యదర్శులకు చెందిన టోకెన్లను వినియోగించి ఈ ప్రాంతంలో జన్మించకుండానే 272 బర్త్, ఈ ప్రాంతంలో మరణించని వారికి 19 డెత్ సర్టిఫికెట్లు తప్పుడు మార్గంలో జారీ చేసినట్లు గుర్తించారు.

ఈ ప్రాంతంలో జన్మించకుండానే బర్త్ సర్టిఫికెట్లు జారీ చేయడం వెనుక పెద్ద స్కాం జరిగి ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ కార్యద ర్శులు మండల పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయగా, ఈ వ్యవహారాన్ని బయ్యా రం పోలీసుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ విషయంపై బయ్యారం ఎస్ ఐ తిరుపతిని వివరణ కోరగా పంచాయతీ కార్యదర్శుల డిజిటల్ సిగ్నేచర్ కీ టోకెన్లు చోరీ అయిన సంఘటనపై ఎంపీవో ఫిర్యాదు చేశారని, నాలుగు గ్రామాల పరిధిలో తప్పుడు మార్గంలో బర్త్ సర్టిఫికెట్లు జారీ అయ్యాయని, ఈ ప్రాంతంలో జన్మించిన వారు కాకుండా ఇతర ప్రాంతాల్లో జన్మించిన వారికి సర్టిఫికెట్ల జారీ విషయంపై విచారణ జరుపు తున్నట్లు చెప్పారు.