25 February, 2026 | 10:53 PM

శ్రీ విఠలేశ్వర ఆలయానికి ప్లేట్లు అందజేత

25-02-2026 05:42 PM

పర్యావరణ పరిరక్షణకు దోహదం 

దాత రాజేందర్ ను అభినందించిన ఆలయ కమిటీ 

కుభీర్: నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని పార్డి (కే) గ్రామంలో గల శ్రీ విఠలేశ్వర ఆలయానికి అదే గ్రామానికి చెందిన దొంతుల రాజేందర్ సుమారు రూ.6వేల విలువచేసే 50 ప్లేట్లను ఆలయ కమిటీకి అందజేశారు. ఈ ఆలయంలో ప్రతి నెలలో రెండు మార్లు వచ్చే ఏకాదశిని పురస్కరించుకొని మరుసటి రోజున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది.

పేపర్ ప్లేట్లు, ప్లాస్టిక్ కవర్లతో కూడిన పేపర్ ప్లేట్ల వల్ల గ్రామంలోని పశువులు వాటిని తిని అనారోగ్యం పాలవుతున్నాయి. దీంతో గమనించిన దాత తనవంతుగా 50 ప్లేట్లలో విరాళం ఇచ్చి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ సందర్భంగా గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ దుంపెటి రాములు, స్థానిక సర్పంచ్ బందెల గంగామణి సత్యనారాయణ, విఠలేశ్వర ఆలయ కమిటీ అధ్యక్షుడు గోజల గజ్జరం, మాజీ ఎంపిటిసి బందెల శంకర్, తదితరులు ఉన్నారు.