18-01-2026 06:34:18 PM
చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూరులో ఉన్న సెయింట్ మార్క్స్ పాఠశాలలో జనవరి 18 ఆదివారం నిర్వహించిన ఐదవ జాతీయస్థాయి సౌత్ జోన్ షూటింగ్ బాల్ సెలక్షన్ లో నల్గొండ జిల్లా కు చెందిన నలుగురు క్రీడాకారులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులలో సీనియర్ విభాగంలో గంగపురం రాము (ఉరుమడ్ల), ఎలుగు చంద్రశేఖర్ (చిట్యాల) , జూనియర్ విభాగంలో ఎస్.కె నాగూర్ వల్లి (నార్కట్ పళ్లి),
సబ్ జూనియర్ విభాగంలో గాదగగొని నాగరాజు (చిట్యాల) షూటింగ్ బాల్ క్రీడలో ఉత్తమ ప్రతిభను కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతిలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీలలో జరగబోయే జాతీయస్థాయి షూటింగ్ బాల్ పోటీలలో వీరు పాల్గొననున్నారు. ఎంపికైన క్రీడాకారులను తాండూర్ డిఎస్పి అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మంగళంపల్లి శ్రీనివాసులు, కార్యదర్శి ఐలయ్య, వికారాబాద్ షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రాము, సెక్రటరీ ఎం. రాములు పాల్గొన్నారు.