18-01-2026 06:39:12 PM
టీడీపీ మండల అధ్యక్షులు కోడెవాసు
మోతే,(విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల అభివృద్ధి తెలుగుదేశం పార్టీ లక్ష్యం మని మండల టిడిపి అధ్యక్షులు కోడె వాసు దేవరావు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో టిడిపి మండల కమిటి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వర్గీయ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని టిడిపి జెండా ఆవిష్కరణ చేశారు.
అనంతరం అయన మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో అన్న ఎన్టీఆర్ ఆశయాలు కొనసాగించేందుకు గ్రామ గ్రామాన పార్టీ అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని చెప్పారు. ప్రజల అవసరాలను తీర్చేది కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమేనని తేల్చి చెప్పారు. గ్రామ ప్రజలకు స్విట్స్ పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం మండల ప్రధాన కార్యదర్శి అండెం సైదులు, మండల ఉపాధ్యక్షులు వెంకట నర్సయ్య, మండల తెలుగు యువత అధ్యక్షులు గిరిబాబు, నాయకులు చింత రవి, గొల్ల గోపుల నారాయణ, డి. నాగయ్య, రాములు, వెంకన్న, ముత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.