3 August, 2026 | 9:22 PM

మండలాభివృద్ధికి నిధులిచ్చి సహకరించండి

03-08-2026 08:46 PM

- మాజీ ఎంపీపీ ముక్తి సత్యం ఎమ్మెల్యేకు వినతి

గుండాల,(విజయక్రాంతి): గుండాల మండలాభివృద్ధికి అధిక నిధులు కేటాయించాలని సోమవారం మాజీ ఎంపీపీ ముక్తి సత్యం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లను కోరారు. మణుగూరులోని సింగరేణి గెస్ట్ హౌస్ లో ఆయన పాయంను  మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

ముత్తాపురం నుండి పెద్దతోగు వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని, మండలంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులన్నీ సత్వరమే పూర్తి చేయాలని, గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో పాటు వివిధ అభివృద్ధి పనులు మంజూరు చేయాలని కోరారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.