3 August, 2026 | 10:09 PM

చేనేత మన సంస్కృతి, అస్తిత్వం

03-08-2026 09:00 PM

- రామకోటి రామరాజు

కొండపాక,(విజయక్రాంతి): చేనేత అనేది కేవలం ఒక వస్త్రం కాదని, అది మన సంస్కృతి, అస్తిత్వం, ప్రాచీన జ్ఞానానికి ప్రతీక అని 'శ్రీరామకోటి భక్త సమాజం' సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజు అన్నారు. ప్రపంచానికి వస్త్రాలను పరిచయం చేసిన ఘనత మన చేనేత రంగానిదేనని, ఈ గొప్ప కళను కాపాడుకోవాల్సిన బాధ్యత మన భుజాలపై ఉందన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో నూతనంగా ఏర్పడిన 'పద్మశాలి చేనేత సహకార సంఘం' కార్యవర్గాన్ని సోమవారం శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా సంఘం చైర్మన్ వడ్లకొండ శ్రీనివాస్, వైస్ చైర్మన్ గంగుల గణేష్, జనరల్ సెక్రటరీ లగిశెట్టి ఆంజనేయులు, ట్రెజరర్ బొజ్జ నరేందర్, జాయింట్ సెక్రటరీ పుల్గం కిష్టయ్యలతో పాటు డైరెక్టర్లు వైద్యుల లక్ష్మీనారాయణ, రాజగిరి వీరేశం, బొజ్జ లలిత, గడ్డమీది సత్తవ్వ సహా మొత్తం 9 మంది సభ్యులను రామకోటి రామరాజు శాలువాలతో ఘనంగా సన్మానించి, సీతారాముల చిత్రపటం,రామకోటి పుస్తకాన్ని జ్ఞాపికలుగా అందజేశారు. చేనేత కార్మికుల సంక్షేమానికి,వృత్తి పరిరక్షణకు కృషి చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు, చేనేత సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.