చెడిపోయిన చేతి పంపుకు మరమ్మత్తులు చేయండి సారు
09-03-2026 10:31 AM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల ప్రాంగణంలో చేతిపంపు చెడిపోయింది. చేతి పంపు చెడిపో ఇవ్వడంతో విద్యార్థులు త్రాగునీటి కోసం, మధ్యాహ్న భోజన సమయంలో ప్లేట్లు కడుక్కునేందుకు వేరే ప్రాంతానికి వెళ్లి ప్లేట్లు కడుగాల్సిన పరిస్థితిగా మారిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చేతిపంపుకు మరమ్మత్తులు చేసేలా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.




