10 March, 2026 | 3:22 AM

చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ఓపెనింగ్

09-03-2026 10:36 AM

గర్భాశయ  ముఖద్వారా క్యాన్సర్ నుండి విముక్తి.

14 సంవత్సరములు దాటిన మహిళలు అందరూ ఉపయోగించుకోవాలి.

వ్యాక్సిన్ గురించి  ప్రముఖుల సూచనలు 

చర్ల,(విజయక్రాంతి): అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో   హెచ్ పి వి వ్యాక్సిన్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని ఉపసర్పంచ్  కాపుల కృష్ణార్జున రావు  ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్  కృష్ణార్జున రావు  మాట్లాడుతూ గవర్నమెంట్ హెచ్ పి వి వ్యాక్సిన్ ఉచితంగా అందుబాటులోకి తేవడం ఎంతో సంతోషించదగిన విషయం అని అనేక మంది స్త్రీలు గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ కి  గురై మరణించడం జరుగుతుంది. అయితే ఈ వ్యాక్సిన్ వలన ఇకపై ప్రతి స్త్రీ గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ నుండి విడుదల పొందవచ్చు అని తెలియజేశారు. 

యం పి డి ఈదయ్య  మాట్లాడుతూ ఇప్పటికే ఈ వ్యాక్సిన్ ప్రైవేట్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నది అయితే ఈ వ్యాక్సిన్ చాలా ఖరీదు తో కూడుకున్న వ్యాక్సిన్. ప్రభుత్వం ఇంత ఖరీదైన వ్యాక్సిన్ ని ఉచితంగా అందించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ వ్యాక్సిన్ కొత్తది కాదు కనుక వ్యాక్సిన్ వేసుకోవడానికి ఎవరూ వెనకంజ వేయకండి ఎటువంటి అపోహలు పెట్టుకోకండి అర్హులైన అందరూ ఈ వ్యాక్స్ ని వేయించుకోవాలని తెలియజేశారు. 

ఎమ్మార్వో ఎం శ్రీనివాసరావు  మాట్లాడుతూ ప్రస్తుతం 14 సంవత్సరాల విద్యార్థిని లకు ఈ వ్యాక్సిన్ అందిస్తున్నారు దసలవారీగా ఈ వ్యాక్సిన్ని అందరూ స్త్రీలకు అందించే అవకాశం ఉన్నది. 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాలు లోపు విద్యార్థినిలు తమ ఆధార్ కార్డు ఆశా కార్యకర్తలకు చూపించి వారి పేరుని నమోదు చేయించుకోవాల్సిందిగా కోరారు. ఈ వ్యాక్సిన్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది గనక ఏ ఒక్కరు కూడా వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండవద్దని తెలియజేశారు. ఎంఈఓ రమణ  మాట్లాడుతూ హెచ్ పి వి వ్యాక్సిన్ ప్రభుత్వం ఉచితంగా ప్రవేశపెట్టడం అద్భుతమైన విషయమని. ప్రతి ఒక్కరు ఈ వ్యాక్సిన్ వేయించుకోవాలని తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్డెంట్ డాక్టర్ సాయి వర్ధన్ ,మెడికల్ ఆఫీసర్ రామ్ ప్రసాద్, హెచ్ పీ వీ వ్యాక్సిన్ ఉపయోగాలు తగు జాగ్రత్తలు తెలియజేశారు. చర్ల   మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హారిక మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మహిళా దినోత్సవం సందర్భంగా ప్రారంభించడం గొప్ప శుభ సూచికమని, ఈ కార్యక్రమం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో నెలరోజులు కొనసాగుతుందని, తరువాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అనంతరం రొటీన్ ఇమ్నైజేషన్ సెషన్ లో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపర్చుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది,ఆశా కర్యకర్తలు పాల్గొన్నారు.