calender_icon.png 8 February, 2026 | 11:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్వాల విమలాదేవిని ఆదరించండి

08-02-2026 12:00:00 AM

అభివృద్ధి కావాలంటే హస్తం గుర్తుకే ఓటు 

పాల్వంచలోని 46వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ముమ్మర ప్రచారం

పాల్వంచ, ఫిబ్రవరి 7(విజయక్రాంతి): 10 సంవత్సరాలపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిందని, అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అభివృద్ధి పతంలో తీసుకెళ్తుందని పాల్వంచలోని 46వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొత్వాల విమలాదేవి అన్నారు. పాల్వంచ డివిజన్ పరిధిలోని 46వ డివిజన్ అభ్యర్థి శనివారం ఇంటింటి ప్రచారం ముమ్మరం చేశారు.

ప్రతి ఓటర్ని నేరుగా కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరిస్తూ ఓట్లను అభ్యర్థి స్తున్నారు. ఓట్ల సమయంలో కల్లబొల్లి మాటలతో ఓట్లు దండుకోటానికి వచ్చే అభ్యర్థుల ను నమ్మొద్దన్నారు. స్థానికంగా ఉండి స్థానిక సమస్యలకు పరిష్కారం చూసే కొత్వాల శ్రీనివాసరావు సతీమణిగా ఓట్లు అడిగే హక్కు తనకు ఉందని ఆమె అన్నారు. విమలాదేవి వెంట వనమా సత్యనారాయణ (చినబాబు), వనమా శ్రీలక్ష్మి, అనూష, రాము తదితరులు పాల్గొన్నారు.