లోక్ సభ జనవాణిని వినిపించాలి: రాహుల్ గాంధీ
26-06-2024 12:21 PM
న్యూఢిల్లీ: 18వ లోక్ సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు.ఇండియా కూటమి తరుఫున ఓం బిర్లాకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సభ భారతదేశ జనవాణిని వినిపించాలని రాహుల్ గాంధీ కోరారు. సభ సజావుగా నడపడంలో విపక్షం మీకు సహకరిస్తోందని ఆయన తెలిపారు. ప్రజావాణిని బలంగా వినిపించేందుకు ప్రతిపక్షాలకు అవకాశమిస్తారని ఆశిస్తున్నానని రాహుల్ పేర్కొన్నారు. విపక్షాల గొంతు నొక్కడం ద్వారా సభ నడపడం అప్రజాస్వామికం అవుతుందన్నారు. ఎన్డీఏ తరుపున వరుసగా రెండోసారి లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ప్రధాని మోడీ, కిరణ్ రిజిజు, రాహుల్ గాంధీ ఓం బిర్లాను స్పీకర్ చైర్‌లో కూర్చోబెట్టారు.






