13 May, 2026 | 12:57 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!

26-03-2026 11:34 AM

బస్సు  ప్రమాదంలో సజీవదహనం.. అత్యంత విషాదకరం

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా(Markapuram Bus Accident) రాయవరం సమీపంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఒక ఘోర బస్సు ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. జగిత్యాల నుండి వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సు, స్థానిక స్లేట్ గనుల వద్ద వేగంగా దూసుకొస్తున్న ఒక టిప్పర్ ట్రక్కును ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. మార్కాపురం రోడ్డు ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

బస్సు ప్రమాదంలో పలువురు సజీవదహనం కావడం అత్యంత విషాదకరం అన్నారు. బాధిత కుటుంబాలకు ప్రధాని ప్రగాఢ సానుభూతి తెలిపాపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోదీ ప్రార్థించారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున  ప్రధాని మోదీ  పరిహారం ప్రకటించారు. ఈ ఘోర బస్సు ప్రమాదంపై కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.