13 May, 2026 | 1:52 PM

Breaking News

పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణ.. బండి భగీరథ్ రాకపై ఉత్కంఠ   •   విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •  

మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 14 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!

26-03-2026 11:55 AM

మార్కాపురం: ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో(Markapuram Road accident) 14 మంది సజీవ దహనమవ్వగా, మరో 28 మందికి పైగా గాయపడిన ఘటన నేపథ్యంలో అధికారులు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.  బాధితుల కుటుంబాలు సమాచారాన్ని పొందడానికి, తగిన సహాయాన్ని అందుకోవడానికి వీలుగా ప్రభుత్వం హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.

గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రులకు తరలించినట్లు, బాధితులను గుర్తించి అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద బాధితులకు సంబంధించిన వివరాలను తెలుసుకోవాలనుకునే కుటుంబ సభ్యులు ఈ క్రింది నంబర్ల ద్వారా నియంత్రణ కేంద్రాన్ని సంప్రదించవచ్చు: 6304285613, 9985733999, 7989537285, 9703578434. ప్రమాదానికి గల కారణంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

ప్రమాదానికి గురైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నంబర్: AR20D0487. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులున్నారు. మృతులు, క్షతగాత్రులందరూ 30 ఏళ్ల లోపు వాళ్లేనని అధికారులు ప్రకటించారు. చాలా మందికి 40 శాతం వరకు కాలిన గాయాలయ్యాయి. కొందరికి కాళ్లూ చేతులు విరిగిపోగా, మరికొందరికి తలకు గాయాలయ్యాయి. బస్సులో జగిత్యాల నుంచి ఇద్దరు, కోరుట్ల నుంచి ఆరుగులు ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. జీవనోపాధి కోసం కార్మికులు ఏపీ నుంచి జగిత్యాలకు రాకపోకలు కొనసాగిస్తున్నారు.